Ap Cabinet Meeting: ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఆర్డీఏ ప్రతిపాదనలు, ఎస్ఐపీబీ నిర్ణయాలు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.
నిరుద్యోగులకు మంచి వార్త ఇవ్వబోతున్న ఈ కేబినెట్ సమావేశంలో రూ.53,922 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టులతో సుమారు 83,437 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. రాజధానిలోని ప్రాజెక్టులకు ఎస్పీవీ ఆమోదం, అర్బన్ డిజైన్లు మరియు ఆర్కిటెక్చర్ మార్గదర్శకాలకు అనుమతి, కన్వెన్షన్ సెంటర్లకు భూముల కేటాయింపులు చేయనుంది. ల్యాండ్ పూలింగ్‌లో చేరని భూములను సేకరించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. అలాగే ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు, అలాగే పారిశ్రామిక పార్కులు మరియు బిజినెస్ సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Internal Links:
ఇందిరమ్మ గృహప్రవేశాలు, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి..
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్…
External Liks:
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..