ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలవనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో సహా పలు ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. రెండు ప్రసిద్ధ బ్యాంకులతో పాటు, హడ్కో కూడా రుణాలు అందించడానికి ముందుకు వచ్చాయి.
దీంతో, అమరావతిలో అనేక నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో, అమరావతిలో నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడానికి మోదీని ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. మరోవైపు, ఈ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ ఆమోదించిన టెండర్లను మంత్రివర్గం ఆమోదించనుంది.