ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్‌, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌ సాయి ఉన్నారు.

ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ దర్శించుకోనున్నారు. కాగా, ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుశరామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర ఆలయం, స్వామిమలై మరియు తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *