ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *