మాజీ ముఖ్య మంత్రి అయినా కేసీఆర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్నలు వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని ఆయన మండి పడ్డారు. ప్రతిపక్ష హోదాను ఆయన తీసుకోకుండా వేరే వారికి ఇవ్వవచ్చు కదా? సమేవేశాలకు హాజరు కానపుడు ప్రతిపక్ష హోదాకి రాజీనామా చేసి బిఆర్ఎస్ సభ్యులలో ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పాలనా అందరికి తెలిసిందన్నారు.

గత ప్రభుత్వం విద్యుత్తు రంగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు , ఆనాడు సక్రమంగా చేస్తే , ఇప్పుడు విద్యుత్తుశాఖ నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ లాభం కాదని తాను 2018లోనే చెప్పానని, అయినా ఆ ప్లాంట్ కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. పోనీ అంత డబ్బులు పెట్టినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయిందా? అంటే అదీ లేదని మండి పడ్డారు. ఆనాడు , ఈనాడు ఉచిత కరెంటు ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *