కేంద్ర మంత్రి బండి సంజయ్ పహల్గామ్ ఘటనపై స్పందిస్తూ, దాయాది దేశం పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న ఆయన, ఉద్యోగాలకు ఎంపికైన వంద మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని పాశవిక చర్యగా వ్యాఖ్యానించిన బండి సంజయ్, ఉగ్రవాదాన్ని పాక్ రక్షణమంత్రి స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. తుపాకీ పట్టినోడు చివరకు తానే తుపాకీకి బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.