కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ భూ వివాదాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థి ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితోనూ చర్చిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *