ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో ఆరోగ్యం, విద్యా, వ్యవసాయ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో బిల్ గేట్స్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్రానికి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి.