తెలంగాణ బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వెలడించారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధాని మోదీ వివక్ష చూపారన్నారు. ఇంత మంది ఎంపీలు ఏమీ చేయలేకపోతే తెలంగాణకు గౌరవం ఉండదని, ఇప్పటికైనా ప్రధాని వద్దకు వెళ్లి తెలంగాణకు బడ్జెట్ కేటాయించేలా చూడాలని తెలిపారు.