నేటి (బుధవారం) నుంచి బీజేపీ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా భాజపా జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కత్తిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పాల్గొన్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జిమ్ ప్రారంభోత్సవంలో మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ డివిజన్‌లో ఉదయం 9.30 గంటలకు మరో జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లో జరిగే బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశానికిహాజరయ్యారు.