News5am, Breaking News Latest (27-05-2025): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయన అమెరికాలో జూన్ 1న డల్లాస్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే, లండన్ పర్యటనలో భాగంగా ‘ఇండియా వీక్ 2025’లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. మే 30న మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్లకు ఆర్&డి సేవలు అందించే పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారు.
ఇంటర్నేషనల్ టూర్‌లో భాగంగా కేటీఆర్ వివిధ దేశాల మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులతో సమావేశమవుతారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్‌లో భారతీయ విద్యార్థులతో సమావేశమై, స్టార్ట్‌అప్స్, నూతన ఆవిష్కరణలు, యువత భవిష్యత్ భారత నిర్మాణంలో పాత్రపై ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం, ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
More Breaking Latest Political:
Breaking News Latest:
రాహుల్ గాంధీతో సీఎం కీలక చర్చలకు సిద్ధం..
కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
More Breaking News Latest: External Sources
అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్