News5am, Breaking News Telugu (29-05-2025): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెబుతున్న కవిత, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ‘‘మీ పార్టీని ముందుగా పరిశీలించండి, మా పార్టీపై వ్యాఖ్యలు చేయవద్దు’’ అని కవితను ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని, అందులో చేరేందుకు తనకు అవసరం లేదని కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు కవితకు లేదని, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలను చూసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ బలంగా ఉందని, తమ పార్టీ నేతలంతా కంఫర్టబుల్‌గా ఉన్నారని స్పష్టం చేశారు.
ఇక ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని, తాను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైందని కవిత చెప్పడం బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, అని కవిత సీరియస్ అయ్యారు. ఇటీవల తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని హాట్ కామెంట్స్ చేశారు.
More Breaking News Political Telugu:
News Telugu:
మంత్రులకు సీఎం ప్రత్యేక డిన్నర్..
అవార్డును గౌరవంగానే కాదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం..
More Breaking News Telugu: External Sources
మా పార్టీ సేఫ్గానే ఉంది.. ముందు మీ పార్టీ గురించి చూసుకోండి.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్