National Breaking Telugu New News5am, (05-05-2025): పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్ / టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యాంప్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ వంటి కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ నిర్వహించిన ఈ బలమైన ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును పెట్టారు.
ఈ దాడుల నేపథ్యంలో AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో స్పందించారు. భారత రక్షణ దళాలు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై చేసిన ఈ సర్జికల్ దాడులను ఆయన ప్రశంసించారు. “పాకిస్తాన్‌లోని ఉగ్ర కేంద్రాలపై మన దళాలు చేసిన చర్యలకు నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. మరో పహల్గామ్ లాంటి దాడి జరగకుండా, పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి. అక్కడి ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి. జై హింద్!” అంటూ ఒవైసీ తెలిపారు.
More National Breaking Telugu News
నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..
More Breaking Telugu New: External Sources
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు