News5am, Breaking Telugu News(28-04-2025): రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులపై సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు. ఒక రోజు సమావేశాల తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ ప్రధానితో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
More Breaking Telugu News:
3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు..
మిస్ వరల్డ్ 2025 కోసం హైదరాబాద్ సిద్ధం..
More Breaking News Latest: External Sources:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ