News5am, Flash News Telugu (14-05-2025): మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మే 23 వరకు, అంటే మొత్తం 11 రోజులు కొనసాగనుంది. యాత్రలోభాగంగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌లో టెర్రరిస్టుల శిబిరాలపై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నేతలు సంకల్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు, బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశభక్తిని పెంపొందించేలా, త్రివర్ణ పతాకానికి గౌరవాన్ని కలిగించేలా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ యాత్ర నిర్వహణపై మే 11న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర సీనియర్ నాయకులు చర్చించారు. జేపీ నడ్డా, సంబిత్ పాత్ర, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ వంటి నేతలు జాతీయ స్థాయిలో ఈ యాత్రను సమన్వయం చేస్తున్నారు. ఈ యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సాయుధ బలగాల ధైర్యాన్ని ప్రజలతో పంచుకోవడం కోసం మాత్రమేనని బీజేపీ స్పష్టం చేసింది.
More News
Flash News Telugu
ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతర్ రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో సమీక్ష..
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం..