తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతతో ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను స్వాధీనం చేసుకుని నిర్మాణం చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా అధినేత రంగనాథ్ ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే విద్యాసంస్థల విషయంలో కాస్త సంయమనం పాటిస్తామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటికి కొంత సమయం ఇస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందజేసిన అధికారులు వాటిని చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మించారని పేర్కొన్నారు.