హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 400 ఎకరాల హెచ్‌సీయూ భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది. ఈ విశ్వవిద్యాలయ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి BRS ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందని గుర్తు చేసింది. BRS హయాంలో మై హోమ్ విహంగా నిర్మాణ భూముల కేటాయింపులో నిజం లేదని పేర్కొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మై హోమ్ విహంగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
అయితే, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు. పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అంటూ మండిపడింది. కాగా, ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పడితే, వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.