కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు భారీ షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో వ్యాపారవేత్తలను ఆమె బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి తిలక్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, FIR నమోదుకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, నిర్మల సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *