ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు. ఇప్పటికే నారా లోకేశ్, పురందేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 1994-99 మధ్యకాలంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు పని చేశారు.