ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.
నిజానికి ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి వచ్చింది. తన తమ్ముడి అనారోగ్య కారణాలతో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.