ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ప్రజా జీవితంలో నిబద్ధత కలిగిన నాయకుడిగా మరెన్నో మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. సినిమా రంగంలో తిరుగులేని హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు.