ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులోని ఎస్సీ కాలనీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రవీణ్ అనే స్థానిక యువకుడి బైక్ రిపేర్ షాపుకు వెళ్లారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ ని ఆప్యాయంగా పలకరించారు. అతని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు? షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు? అని ఆ యువకుడిని సీఎం చంద్రబాబు అడిగారు.
అందుకే వేరే చోట దుకాణం ఏర్పాటు చేసి నీకు మంచి పనిముట్లు ఇస్తామని చెప్పారు. వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచారు. యువకుడు ప్రవీణ్ కు మరో మంచి ప్లేస్ లో బైక్ మెకానిక్ షెడ్ కట్టించి, సరైన పనిముట్లు అందించాలని ఆదేశించారు. అతడికి స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇప్పించాలని స్పష్టం చేశారు. ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు.