ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సొంత ఇంటికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సచివాలయం వెనుక ఉన్న E9 రోడ్డు పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇల్లు నిర్మించనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ప్రాంతం ఉంటాయి. ఈ ఇల్లు 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్‌లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *