ఊపిరిసలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఆయన ఈరోజు యూరప్ పర్యటనకు వెళుతున్నారు. కాసేపట్లో ఆయన 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం కానున్నారు.రాత్రికి విజయవాడలో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆయన విందు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళతారు.
ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి యూరప్ కు బయలుదేరుతారు. ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోబోతున్నారు. చంద్రబాబు నాయుడు 22న ఢిల్లీ చేరుకుంటారు. 23వ తేదీన ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.