సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేయనున్నారు. తిరుమలలో పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. టీటీడీ పూర్తి ప్రక్షాళన, అభివృద్ధితో పాటు తిరుమల పవిత్రత పెంపుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఏఐ టెక్నాలజీ తో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాల కల్పన, అన్యమత ఉద్యోగులను ప్రభుత్వశాఖలకు బదిలీ చేయడం. దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం జరిగిన నిధులు కేటాయింపులు ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీలు తదితర కీలక ఆంశాలను తాము ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని బీఆర్ నాయుడు వివరించారు.