CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ శాఖలో మార్పులు తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఒక విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న SPDCL, NPDCLలతో పాటు ఈ కొత్త డిస్కమ్ ద్వారా ఉచిత వ్యవసాయ విద్యుత్, ఉచిత గృహ విద్యుత్ (200 యూనిట్లు), పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ వంటివన్నీ చూసుకోవాలని చెప్పారు. కొత్త డిస్కమ్ రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా పనిచేయాలన్నారు. ఇలా చేస్తే ఉన్న డిస్కమ్‌ల పనితీరు మెరుగవుతుందని, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. డిస్కమ్‌లు ఉన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్ సంస్థలపై ఉన్న అప్పులను తగ్గించాలని సూచించారు.
డిస్కమ్‌లు 10 శాతం వడ్డీతో అప్పులు తీసుకోవడం వల్ల నష్టాల్లో పడిపోయాయని, వీటిని తక్కువ వడ్డీతో మళ్లీ రూపొందించాలని (రీ-స్ట్రక్చర్ చేయాలని) సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. అందుకోసం అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని, అనువైన భవనాలను జిల్లాల కలెక్టర్లు గుర్తించాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Internal Links:
ప్రభుత్వ జాగాల్లో ప్రార్థనా మందిరాలు కట్టొద్దు..
నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి..
External Links:
రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..