తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఎల్లమ్మ దేవి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, జూపల్లి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.