రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆగస్టు 14 వరకు ఆయన విదేశాల్లోనే ఉంటారు.ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు.
నేటి నుంచి 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో ముఖ్యమంత్రి బృందం అందుబాటులో ఉంటుంది. అమెరికాలోని వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. సీఎం బృందం నేరుగా న్యూయార్క్ వెళ్లనుంది. 4వ తేదీన న్యూజెర్సీలో పర్యటించనుంది. 5న న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈవోను కలవనున్నారు. మరోవైపు ఆగస్టు 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. ఇవాల్టి నుంచి సుమారు 12 రోజులు విదేశీ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు.