Congress Mahadharna: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీ మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ఏఐసీసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియా కూటమిలోని డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు బీసీలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించనున్నాయి.
ఈ ధర్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌తో పాటు మంత్రులు ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. వేదికపై 200 మంది కూర్చునేలా, సభ కోసం 1500 కుర్చీలతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహాధర్నాలో పాల్గొనే వెయ్యి మంది నేతలకు స్థానిక హోటళ్లు, వైఎంసీఏలో వసతి కల్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం అధికారిక నివాసాల్లో వసతి ఏర్పాటు చేశారు.
Internal Links:
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి కౌంటర్..
బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..
External Links:
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా.. హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేతలు!