కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఈరోజు (జూలై 22) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీప్దాస్ మున్షీ నేతృత్వంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, వరంగల్ సభపై ప్రియాంకతో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వీరంతా ఈరోజు రాహుల్ గాంధీని కలిసి వరంగల్ సభకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.