నేడు హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. గిరిజన జాతరగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని తొలిసారి దక్షిణాది అయిన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారు. వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.
భారత దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు . దేశంలో ఉన్న జానపద కళాకారులందరినీ ఒకే వేదిక మీదకు చేర్చి కళలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పదిహేను వందలకు మందికిపైగా జానపద కళాకారులు పాల్గొంటారు. కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కిషన్‌రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.