నాడు రెడ్డి జిల్లా కందుకూరు మండలం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలతో చర్చించారు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు చేసి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని నిన్న జరిగిన సమావేశంలో కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా అని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం, వానాకాలం సీజన్ పూర్తి అవుతున్న రైతు భరోసా ఊసేలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *