Former Cm Kcrs Ganapathi Homam: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించారు. ఆయన సతీమణి శోభతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి కూడా విఘ్నాలు తొలగాలని ప్రార్థన చేశారు. ఐదు రోజులుగా కేటీఆర్ అక్కడే ఉంటున్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు.
ఇటీవల కవిత, హరీష్ రావు మరియు సంతోష్‌పై తీవ్ర విమర్శలు చేసింది. హరీష్ అవినీతి కారణంగా కేసీఆర్ బద్నాం అవుతున్నారని ఆరోపించింది. దీనిపై కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
Internal Links:
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
ఇందిరమ్మ గృహప్రవేశాలు, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి..
External Links:
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం.. విజ్ఞాలు తొలగాలని పూజలు