Former Minister KTR: ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ మమత హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పువ్వాడ అజయ్ అభివృద్ధిని లక్ష్యంగా పని చేశారని ప్రశంసించారు. ఇది ప్లాన్ చేయని కార్యక్రమమని, ఇంతమంది కార్యకర్తలు, ఆడబిడ్డలు పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు తెలంగాణను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేశామని, అన్ని రంగాల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. 2014లో 64 సీట్లు, 2018లో 88 సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. కాగా, రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు బోగస్ అని, కాంగ్రెస్ పార్టీ యువత, మహిళలు, వృద్ధులను ఉద్యోగాలు, నిధులు, పింఛన్లు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.
ఇది ప్రజలకు ఒక పాఠం అయిందని, కేసీఆర్ పెట్టిన భోజనానికి బిర్యానీ పేరిట మోసం చేయడం వింత రుచిని తలపిస్తోందన్నారు. అంబేడ్కర్ ఇలాంటి దుర్మార్గులను ఊహించలేదని, అందుకే రీకాల్ వ్యవస్థ పెట్టలేదన్నారు. ఒక్క ఓటుతో ప్రజలు 5 ఏళ్లు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. ముగ్గురు మంత్రులు మొనగాళ్లలా తిరుగుతున్నారని, అందులో ఒకరు బాంబుల మంత్రి అని ఎద్దేవా చేశారు. దీపావళి రోజున పేల్చే బాంబులు ఇప్పటికీ పేలలేదని, ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టే దుస్థితి వచ్చిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన తీరుపై విసుగు చెందుతున్నారని, ఈసారి ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లతో గెలవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల, పార్టీ తరఫున సహకారం అందుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Internal Links:
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు..
మాజీ సీఎం కేసీఆర్తో హరీష్ రావు కీలక భేటీ..
External Links:
కేసీఆర్ భోజనం పెడుతుంటే.. సీఎం రేవంత్ బిర్యానీ పెడతాడని గెలిపిస్తే మోసం చేశాడు