గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గంలో తన దత్తత గ్రామమైన కొండపర్తికి చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఘన స్వాగతం పలికారు. గిరిజనులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి రూ.కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళల కోసం మిర్చి యూనిట్, మసాల, పసుపు, పిండి యూనిట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ మాట్లాడుతూ, గిరిజనులు వెనకబడి ఉన్నారు కాబట్టి అధికారులందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడం చాలా ఆనందం అనిపించింది. ఈ కొండపర్తి గ్రామాన్ని దేశంలో రోల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలి. నేను ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చాను. మా గ్రామం కూడా నా చిన్నప్పుడు కొండపర్తిలానే ఉండేది.