తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కు సిఫార్స్ చేసింది. ఐతే కొత్త నియామకాలపై సుప్రీంకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దక్కినట్లయంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ స్టే అమలులో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాధ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
మరోవైపు కొత్త నియామకాలను చేపట్టకుండా ఆపాలన్న పిటిషనర్లు కోరికను సుప్రీం తిరస్కరించింది. గవర్నర్, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించింది. అనంతరం పెటిషన్ పై ధర్మసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.