GST Slab Rates: కేంద్ర మంత్రుల బృందం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 12% మరియు 28% పన్ను స్లాబ్‌లను తొలగించడానికి అంగీకరించింది. దీంతో ఇకపై 5% మరియు 18% స్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. ఇప్పటివరకు 5%, 12%, 18%, 28% కింద వసూలు చేస్తున్న జీఎస్టీ రాబోయే రోజుల్లో రెండు స్లాబ్‌లకే పరిమితం అవుతుంది. ఈ ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించగా, తుది నిర్ణయం సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమక్షంలో తీసుకోనున్నారు. అయితే ఈ మార్పులపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మంత్రుల బృందం తాము కేవలం సిఫార్సు చేశామని, తుదినిర్ణయం కమిటీ చేతిలో ఉంటుందని స్పష్టం చేసింది.
అదే సమయంలో, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను 18% జీఎస్టీ పరిధి నుంచి తొలగించే అంశంపైనా చర్చ జరిగింది. ఇక లగ్జరీ కార్లు, లగ్జరీ వస్తువులపై ప్రత్యేకంగా 40% పన్ను విధించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సంస్కరణలపై ఆమోదం తెలిపిన మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ మంత్రి కె.ఎన్. బాలగోపాల్ ఉన్నారు.
Internal Links:
మరోసారి సొంత పార్టీపై విరుచుకుపడ్డ మునుగోడు ఎమ్మెల్యే
పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది..
External Links:
12 శాతం.. 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ రద్దు.. మంత్రుల గ్రూప్ అంగీకారం..