Harish Rao Slams Revanth Reddy

Harish Rao Slams Revanth Reddy: ఉప్పల్‌లో నిర్వహించిన BRSV రాష్ట్రస్థాయి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తారని, జై మోడీ, జై ఢిల్లీ అన్నట్లు చెబుతున్నా, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రేవంత్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు ప్రజల బాటలో లేరని, రాజీనామా చేయకుండా తప్పించుకున్నారని గుర్తుచేశారు. ఒకసారి రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తే రేవంత్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి గౌరవం ఇవ్వకుండా దాన్ని మరుగున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహులుగా పరిగణించాలని హరీష్ అన్నారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోందని ఆరోపించారు.

హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ తల్లి, కాకతీయ తోరణం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించడం రేవంత్ పాలన లక్ష్యంగా మారిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేయని వ్యక్తి సీఎం అయ్యాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గొప్ప విజనరీ నేతగా అభివర్ణిస్తూ, ఆయన ఎప్పుడూ కక్ష రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. కానీ రేవంత్ మాత్రం ప్రతి విషయంలో వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఈ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని, చంద్రబాబుకి నీళ్లు, రాహుల్ గాంధీకి నిధులు పంపుతున్న విధంగా రేవంత్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. గురుశిష్యులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Internal Links:

ఏపీలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి రూ.20,216 కోట్ల పెట్టుబడులు..

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఒప్పుకోకపోతే దేశ వ్యాప్త ఆందోళన..

External Links:

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి.. BRSV సభలో మాజీ మంత్రి హాట్ కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *