కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకుల ఇళ్ల వద్ద భారీ పోలీసు భద్రతను మోహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
మరోవైపు, హెచ్‌సియు వద్ద కూడా భారీ పోలీసు మోహరింపును ఏర్పాటు చేశారు. అక్కడ నిరసన తెలుపుతున్న సీపీఎం, సీపీఐ, బీజేవైఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.