ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే, కాంగ్రెస్ లో చేరడంపై హైకోర్టులో నేడు వాదనలు జరగనున్నాయి. ఈరోజు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే ఏజీ తరుపున తమ వాదనలను విన్న హైకోర్టు నేడు ఎమ్మెల్యేల తరుపున వాదనలు విననుంది.
బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని తప్పు పడుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తూ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టలేవన్న వాదనను కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీ తరుపున న్యాయవాదులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు కూడా విచారణ సాగనుంది.