Jagga Reddy-KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందని, తెలంగాణను ఇచ్చిన పార్టీని చిల్లరగా ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సభలో అన్నాడని, అదే మాటను కేటీఆర్ మర్చిపోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే, నీ నాన్న కూడా థర్డ్ క్లాస్ కదా అని సూటిగా ఎత్తి చూపారు. కాంగ్రెస్ వల్లే మీ కుటుంబం ఎదిగిందని, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీదే బతికేవారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినప్పుడు మద్దతివ్వాల్సింది పోయి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తావా అని ప్రశ్నించారు. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉన్నా రాజకీయ పరిపక్వత రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని తీవ్రంగా విమర్శించారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేసిన దీక్ష కూడా కాంగ్రెస్ డిజైన్ అని, ఆ సమయంలో ప్రజలు చేసిన త్యాగాల విలువ కేటీఆర్‌కు తెలియదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజలకు ప్రయోజనం ఏమైందో తెలియకపోయినా, కేసీఆర్ కుటుంబానికి మాత్రం లాభమైందని అన్నారు. సచివాలయంలో తాను సమీక్షలు చేస్తే దానిని తప్పుగా చూపుతున్నారని, కానీ ప్రజల కోసం చేస్తున్న పనిని విమర్శించడం తగదని తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఒకేలా పని చేస్తానని చెప్పారు. కిషన్ రెడ్డి మంచోడే కానీ స్క్రిప్ట్ లీడర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. రైతులకు యూరియా ఇవ్వాల్సింది కేంద్రం అని, రాష్ట్ర ప్రభుత్వంపై అప్రయోజన ఆరోపణలు చేయడంలో లాభం లేదని ప్రశ్నించారు.
Internal Links:
28 శాతం జీఎస్టీ స్లాబ్స్ రద్దు..
మరోసారి సొంత పార్టీపై విరుచుకుపడ్డ మునుగోడు ఎమ్మెల్యే
External Links:
కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!