ఇటీవల కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లు తీసుకొని, 21 స్థానాలలో వారి అభ్యర్థులను నిల్చోపెట్టి పోటీ చేసిన 21 స్థానాల్లో భారీ అఖండ విజయంతో గెలిచినా విషయం తెల్సిందే. పార్టీని మరింత మెరుగుపరిచేందుకు, పార్టీ బలగాన్నిపెంచేందుకు పార్టీ యోచిస్తుంది. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఈనెల 18 నుంచి, 28 వ తారీకు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సభ్యత నమోదును ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది అని తెలిపారు. పది రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇప్పటికే ఉన్న 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను రెన్యువల్ చేయించాలని ఆదేశించారు, జనసేనలో క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు జనసేన పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందని, మీరు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని ఎప్పటికి మరచిపోలేము అని తెలిపారు. ప్రజల సమస్యలపై జన సేన పార్టీకి స్పందించే మనస్తత్వం ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.