ఈ నెల 28న కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సీఎం పదవి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు తెలిపారు.