ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
కవిత వెంట ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. కవిత చాలా ఉత్సాహంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్ కు రావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, కవిత హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లనున్నారు.