ఈ ఏడాది మార్చి 16న ఈడీ BRS MLC కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో BRS MLC కవితకు బుధవారం (జూలై 31) మరో నిరాశ ఎదురైంది. స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన కేసులో ట్రయల్ కోర్టు కవితకు జ్యుడిషియల్ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది.
కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.