ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు ఐదున్నర నెలలు గడిపారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్‌హౌస్‌లో తండ్రి పాదాలకు నమస్కరించారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది.
కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కోలాహలంగా మారింది. కవిత 10 రోజుల పాటు ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్‌పై కవిత విడుదల కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. మరోవైపు తనను కలవడానికి ఎవరూ ఫామ్‌హౌస్‌కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే.