ఖమ్మం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలారు. ఖమ్మంలోని 20కి పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకుని భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శివరాజ్ సింగ్ విజయవాడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకోనుండగా, బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటారు.
అనంతరం రాష్ట్ర అధికారులతో పంట నష్టం, ఆస్తి నష్టంపై సమీక్షించనున్నారు. అనంతరం 11.30 గంటలకు సచివాలయంలో సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సమీక్షిస్తారు.