తెలంగాణ అసెంబ్లీలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అతను మద్యం కేసులో ఉన్నాడని, ఇంకేదో చేశారని కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాటిని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరాన్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలని నిర్ణయించారు.
కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏవైనా రుజువైతే రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోతానన్నారు. రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.కోమటి రెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే, ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. వారు కూడా రాజీనామా చేయాలన్నారు. జగదీశ్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. జగదీష్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడు. దొంగతనం కేసులో నిందితుడే అన్నారు.మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్నారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.