బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీ నేతల సమావేశంలో తాను చేసిన సాధారణ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. నిన్నటి పార్టీ మీటింగ్‌లో మా మహిళా సోదరీమణులు బాధపడి ఉంటే క్షమించండి.. నా సోదరీమణులను కించపరచాలని నేనెప్పుడూ అనుకోలేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు కుటుంబాలకు కుటుంబాలు బస్సులో ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్కతోపాటు కాంగ్రెస్ మహిళా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆక్షేపించారు. అతని వ్యాఖ్యలను పరిశోధించడానికి. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ స్పందించారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.