రైతు రుణమాఫీ ఫై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాక్యాలకు, బిఆర్ఎస్ అధినేత కేటీఆర్ “చారణ కోడికి బారాణ మసాల” అనే సామెతని వాడారు. రుణమాఫీ అయిన రైతులకన్నా, రుణమాఫీ కానీ రైతుల కుటుంబాలు చాల ఉన్నాయి అని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం విధించిన నియమాలతో అన్ని అర్హతలు ఉన్న వారికీ కూడా రుణమాఫీ కాలేదు, వాళ్ళ బాధని వినేవారు కూడా లేరని కేటీఆర్ తెలిపారు. జూన్‌‌‌‌‌‌‌‌లో వేయాల్సిన రైతుభరోసా జూలై వచ్చినా కూడా రైతుల ఖాతాలో ఎందుకు జమచేయలేదు అని రాష్ట్ర సర్కారును కేటీఆర్ నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *